ఆదిపురుష్ ను ఆదుకున్న ఆంజనీయస్వామి !

Seetha Sailaja

ఇప్పటివరకు ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించి విడుదల చేయబడ్డ టీజర్ కు స్టిల్స్ కు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. శ్రీరాముడు కి జంధ్యం లేదు అంటూ కొందరు కిరీటం లేని శ్రీరాముడు ఏమిటి అంటూ మరికొందరు సీతాదేవి శాలువ కప్పుకున్నది ఏమిటి అంటూ ఇలా రకరకాల కారణాలతో ఇప్పటివరకు ‘ఆదిపురుష్’ మూవీ పై ట్రోలింగ్ లు ఎక్కువగా జరిగాయి.

అయితే హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి గెటప్ తో ఉన్న స్టిల్ కు అదేవిధంగా ఆ స్టిల్ తో విడుదలచేసిన ఒకచిన్న సాంగ్ బిట్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సాంగ్ బిట్ మరీ ట్రెడిషనల్ గా లేకపోయినప్పటికీ వినేవారికి ఉత్సాహాన్ని కలిగించేలా ఉంది. హనుమంతుడి పాత్రలో దేవ దత్తా నాగే నటిస్తున్నాడు. ఈసినిమాకు దర్శకత్వం వహించిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ పై వస్తున్న విమర్శల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఒకసారి ప్రేక్షకులు ఈసినిమాను చూడటానికి మల్టీ ప్లెక్స్ ధియేటర్లలోకి వచ్చి త్రీడీ వెర్షన్ లో చూసినప్పుడు వచ్చే అనుభూతితో అప్పటివరకు ఆసినిమా పై వచ్చిన అన్ని విమర్శలు మరిచిపోతారు అంటూ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఓం రౌత్ చెపుతున్నాడు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ అనేక భాషలలో విడుదల అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను 10 వేల ధియేటర్లలో విడుదల చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ మొదటివారంలోనే ఈమూవీ పై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా ఈమూవీ నిర్మాణ సంస్థ టి సిరీస్ భారీ ప్రణాళికలు రచిస్తోంది.

దక్షిణాది ప్రేక్షకులకు శ్రీరాముడు అంటే ఒక విభిన్నమైన రూపం మనసులో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంది. అయితే ఉత్తరాది ప్రాంతంలో శ్రీరాముడు సీతాదేవి ని వివిధ రూపాలలో చూపించే విధంగా అక్కడి ఆలయాలు ఉంటాయి. అందువల్ల దక్షిణాది ప్రేక్షకులు ఈమూవీ పై ఎలాంటి విమర్శలు చేసినప్పటికీ ఈమూవీ విడుదల తరువాత బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ఖాయం అన్న అంచనాలలో ఈమూవీ నిర్మాతలు ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: