హైట్రిక్ హిట్ పై కన్ను వేసిన రవితేజ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ 2021 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు . ఇలా క్రాక్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న రవితేజ ఆ తర్వాత ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు .

ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇలా క్రాక్ మూవీ తర్వాత రెండు వరుస అపజయాలను ఎదుర్కొన్న రవితేజ పోయిన సంవత్సరం చివరన విడుదల అయినటు వంటి ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందినటు వంటి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు .

 ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా రవితేజ ఇప్పటికే వరుసగా రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. తాజాగా రవితేజ ... సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించినట్లు అయితే రవితేజ హైట్రిక్ విజయాలను అందుకున్నట్లు అవుతుంది. మరి రవితేజ "రావణాసుర" మూవీ తో మంచి విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హైట్రీక్ విజయాలను అందుకుంటాడో ... లేదో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: