ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "రావణాసుర" మూవీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో లాయర్ పాత్రలో రవితేజ తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అల్లరించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహించింది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి  అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా రావణాసుర మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

ఈ మూవీ నైజాం ఏరియాలో 235 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియాలో 165 థియేటర్ లలో ... ఆంధ్ర ఏరియాలో 300 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 700 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 75 థియేటర్ లలో విడుదల కానుండగా ... ఓవర్సీస్ లో 150 థియేటర్ లలో విడుదల కానుంది  మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 925 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఇలా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్య థియేటర్ లలో విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: