ఎన్బికె 108 : ఆ సన్నివేశాల చిత్రీకరణ..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందినటు వంటి అఖండ అనే మూవీ తో భారీ విజయా న్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు . ఆ తరువాత వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో రెండు వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ యొక్క చిత్రీకరణ ను ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ప్రకటించ లేదు .

ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర లో కనిపించబోతుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ పై అదిరిపోయే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు ... అవి కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నైట్ సీన్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ చాలా బాగా వస్తున్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: