ఉస్తాద్ భగత్ సింగ్ : ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం పవన్ కు సంబందించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

 ఈ ఫస్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే రెండు స్టైలిష్ లుక్ లో ఉండడంతో ఈ మూవీ మొదలు కాక ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే నిన్నటి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి తేరి అనే మూవీ కి రీమేగా రూపొందుతుంది. ఈ సినిమా తెలుగు లో పోలీసోడు పేరుతో విడుదల అయింది. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇలా తమిళ ... తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ ని తెలుగులో రీమిక్ చేస్తున్నారు. ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే మరియు ఇంకా చాలా విషయాలలో అనేక మార్పులు ... చేర్పులను హరీష్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: