"రామబాణం" మూవీ మొదటి సాంగ్ ప్రోమో విడుదల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో హీరో గాను ... విలన్ గానూ నటించి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. గోపీచంద్ తన కెరియర్ లో ఎక్కువ శాతం మాస్ ఎంటర్టైనర్ మూవీ లలో నటించి మంచి విజయాలను అందుకున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మాస్ కమర్షియల్ కథలతో అద్భుతమైన విజయాలను అందుకున్న గోపీచంద్ మరో సారి ఒక అదిరిపోయే మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ "రామబాణం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల ముద్దుగుమ్మ డింపుల్ హయాతి హీరోయిన్ గా కనిపించబోతోంది.

ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి "ఐ ఫోన్" అంటూ సాగే మొదటి పాటకు సంబంధించిన ప్రోమో వీడియోని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ మూవీ తో గోపీచంద్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: