బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చేసిన ఎన్టీఆర్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో భారీ విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయిన "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.

ఈ మూవీ లు అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ గా పెరిగి పోయింది. దానితో ఎన్టీఆర్ కూడా తన తదుపరి మూవీ లను అదే స్థాయిలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ఆధునాతన టెక్నాలజీతో రూపొందబోతుంది.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక అదిరిపోయే బాలీవుడ్ మూవీ ని ఓకే చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్ హీరోగా టైగర్ షార్ఫ్ కీలక పాత్రలో రూపొందిన వార్ సినిమా ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సీక్వెల్ గా వార్ 2 మూవీ ని రూపొందిచనునట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ మూవీ లో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇలా భారీ క్రేజ్ కలిగిన వార్ 2 మూవీ లో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: