పుష్ప -2 నుంచి అదిరిపోయే అప్డేట్స్ ..!!

Divya
ఎన్నో రోజులుగా వేచి చేస్తున్న అల్లుఅర్జున్ అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ వెండి తెరపైన అసలు కనిపించలేదు. కేవలం పుష్ప-2 కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తున్నది. పుష్ప సినిమా మొదటి భాగం 2021లో విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మార్చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమా సీక్వెల్ మీదే దృష్టి పెట్టారు.హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా  తెరకెక్కిస్తున్న ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ పుష్ప-2 అప్డేట్ ఇవ్వమని అడుగుతూ ఉంటే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తాజాగా అభిమానులకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప -2 నుంచి అప్డేట్ రానుందని మేకర్స్ తెలియజేశారు.

ఏప్రిల్ 5వ తేదీన అంటే ఈరోజ ఉదయం 11 గంటలకు ఆ పేరు ఇవ్వబోతున్నారు తెలిపారు. ఆ అప్డేట్ ఏంటి అనే విషయం మాత్రం తెలుపలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన పుష్ప -2 కాన్సెప్ట్ టీజర్ 8 వ రోజున ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారు. బన్నీ బర్తడే ఒక సరికొత్త టీజర్ ని కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది ఒక అప్డేట్ ఏదైనా కానీ రావడం ఆలస్యం అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. ఎట్టకేలకు పుష్ప-2 సినిమా పైన అప్డేట్ రావడంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: