ఈరోజు ఆ సమయానికి ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించనున్న రవితేజ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ పోయిన సంవత్సరం విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా పోయిన సంవత్సరం ధమాకా మూవీ.తో సోలో హిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందినటు వంటి వాల్తేరు వీరయ్య అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో కీలక పాత్రలో నటించ 

ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరస ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గం. ల నుండి తన అకౌంట్ ద్వారా #AskRavanasura హ్యాష్ టాగ్ ద్వారా ఫ్యాన్స్ తో కొద్ది సేపు రవితేజ చాట్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రవితేజ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో పూజితా పొన్నాడ, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, దక్షా నాగర్కర్ హీరోయిన్స్ గా నటించారు. సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: