రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ టైటిల్ విడుదల..!

Pulgam Srinivas
నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరో గా రూపొందిన ఛలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విపరీతంగా పెరిగి పోయింది . ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది .
 

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రం రష్మిక నటించ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ కి ఓకే చేసింది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన టైటిల్ కూడా విడుదల అయింది. రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ కి రెయిన్ బో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ మూవీ కి శాంతరుబన్ దర్శకత్వం వహించనుండగా ... డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. రష్మిక నటిస్తున్న మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: