"ఎన్బికె108" డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ ... వీర సింహా రెడ్డి మూవీ ల వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చిత్రీకరిస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యి చాలా వరకు పూర్తయింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు జనాల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఈ ఈ మూవీ కి సంబంధించిన "ఓ టి టి" హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మివేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఈ మూవీ ని ఏకంగా 36 కోట్ల భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ . . బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మొట్ట మొదటి మూవీ. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుండగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: