షారుక్ ఖాన్ "జావాన్" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పటాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది  ఇలా పటాన్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ ఖాన్ , అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ పై ఇటు హిందీ ... అటు తమిళ ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర బృందం మొదలు పెట్టి వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: