ఇప్పటికీ "ఓటిటి" లో ట్రెండింగ్లో ఉన్న బాలకృష్ణ కొత్త సినిమా..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు  ఈ మూవీ కి వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో దునియా విజయ్ ... వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలలో నటించగా ... క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన మూవీ కావడం ... క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా గత కొంత కాలంగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఈ సినిమా ట్రెండింగ్ లోనే ఉంది. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు కంటెంట్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇలా వీర సింహా రెడ్డి మూవీ ఇప్పటికీ కూడా తన జోష్ ను డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: