దసరా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాష లలో నిన్న అనగా మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. 

ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు సూపర్ కలెక్షన్ లు దక్కాయి  అందులో భాగంగా ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.78 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ లో 2.36 కోట్లు ... యు ఏ లో 1.42 కోట్లు ... ఈస్ట్ లో 90 లక్షలు ... వెస్ట్ లో 55 లక్షలు ... గుంటూరు లో 1.22 కోట్లు ... కృష్ణ లో 64 లక్షలు ... నెల్లూరు లో 35 లక్షలు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు దసరా మూవీ కి 14.22 కోట్ల షేర్ ... 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా మొదటి రోజు దసరా మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లాంగ్ రన్ కూడా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: