శ్రీరామనవమి సందర్భంగా రామబాణం సినిమా నుంచి అప్డేట్..!!

Divya
సూపర్ డూపర్ ఫ్యాక్టరీ కాంబో రాబోతున్నది.. గోపీచంద్, శ్రీవాస్.. గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రామబాణం. అయితే ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు .గోపీచంద్ శ్రీనివాస్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. అందుకే ఈసారి హ్యాట్రిక్ వాటిపైన గురిపెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించడం జరిగింది. ఈ సినిమా మే 5వ తేదీన వేసవి సెలవుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా డింపుల్ హయాతి నటిస్తున్నది మరో సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు కూడా కీలకమైన పాత్రను నటిస్తున్నట్లు సమాచారం. తాజగా ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే శ్రీరామనవమి సందర్భంగా పండుగను పురస్కరించుకొని నేడు చిత్ర బృందం ఒక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో గోపీచంద్, జగపతిబాబు వైట్ అండ్ వైట్లో పంచలు కట్టుకొని మరి తలపాక చూస్తే నుదుటిమీద కుంకము విభూది ధరించి కనిపిస్తూ ఉన్నారు.
అంతే కాకుండా ఇద్దరు చేయి పట్టుకొని మరి నడుస్తూ ఉన్నటువంటి ఫోటోలు చిత్ర బృందం షేర్ చేసింది.. ఇదేదో గుడిలో పూజ తర్వాత తీసిన ఫోటో అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోతో పాటు సినీ ప్రేక్షకులందరికీ చిత్ర బృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగపతిబాబు, గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ పోస్టర్లు అందరిని ఆకట్టుకుంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు సమాచారం. కథ కు తగ్గ నటీనటులు సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది. సచిన్ కేదార్ ,నాజర్, అలీ ,రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ ,సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: