ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీ రోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే విజయ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన వారిసు అనే సినిమాలో హీరోగా నటించాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు  తమిళం లో రూపొందిన ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేశారు.

ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కాగా ... తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. వారిసు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం లియో అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అందాల ముద్దు గుమ్మ త్రిష ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. లియో మూవీ తర్వాత విజయ్ తన తదుపరి మూవీ ని ఇప్పటికే కన్ఫామ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న వేట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: