అఫీషియల్ : వెంకటేష్ "సైంధవ్" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ పోయిన సంవత్సరం విడుదల అయినటు వంటి ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
 

మంచి ఫ్యామిలీ ప్లేస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో రానా కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం హిట్ సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వెంకటేష్ గన్ పట్టుకొని స్టైలిష్ లుక్ లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: