పోటీపడి అందాలను ప్రదర్శిస్తున్న.. కాజల్-నిషా అగర్వాల్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్స్ గా మారిన అక్కా చెల్లెలు చాలామంది ఉన్నారు.అందులో ముఖ్యంగా కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ కూడా ఒకరు. ఇక తన అక్క చూపిన దారిలోనే నిషా అగర్వాల్ కూడా ఎదగాలనుకుంది కానీ అక్క మాదిరిగా మాత్రం సక్సెస్ కాలేకపోయింది . 2010లో సంపత్ నంది డైరెక్షన్లో వచ్చిన ఏమైంది ఈవేళ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిషా అగర్వాల్ మొదటి చిత్రంతో పరవాలేదు అనిపించుకుంది.ఆ తర్వాత సోలో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కాజల్ మాదిరి తన చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్గా అవుతుందని అనుకున్నారు.

కానీ 2014లో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. 2013లో వ్యాపారవేత్త కరణ్ ను వివాహం చేసుకుంది నిషా అగర్వాల్. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.ఇక కాజల్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో సత్తా చార్జిన ఈ ముద్దుగుమ్మ 2020 వివాహం చేసుకుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భారీ ప్రాజెక్టులతో ముందుకు రావడం జరుగుతుంది. బాలయ్య అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపిక అయింది. మొదటిసారి బాలకృష్ణకు జోడిగా నటిస్తోంది.
అలాగే కాజల్ అగర్వాల్ భారతీయుడు-2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది ఈ సినిమా గత ఏడాది తిరిగి ప్రారంభమైంది ఎన్నో వివాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం హీరోయిన్గా వరుస ఆఫర్లు వస్తున్న కాజోల్ అగర్వాల్ కు ఎలా కలిసి వస్తుందో చూడాలి. తాజాగా కాజోల్ నిషా అగర్వాల్ ఇద్దరూ కలిసి తమ అందాల ప్రదర్శనతో పోటీపడి ప్రదర్శిస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలు వైరల్ గా మారుతున్నాయి. వీరి ఫోటోలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదంటు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: