"ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఆ తేదీ నుండే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు ... అందులో భాగంగా పవన్ సరసన ఈ మూవీ లో శ్రీ లీల ... మాళవిక మోహన్ లు కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మాళవిక ఈ మూవీ లో నటించడం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

మరి ఈ సినిమాలో శ్రీ లీల దాదాపుగా హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లే అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. అలాగే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి తేరీ కి అధికారిక రీమిక్ గా రూపొందుతోంది.

ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా కథలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో ఇదివరకే గబ్బర్ సింగ్ మూవీ రూపొంది మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ మూవీ దబాంగ్ కు అధికారిక రీమేక్ గా రూపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: