ఏజ్ పెరిగిన జోరు తగ్గని తమన్నా..!

Pulgam Srinivas
వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటి ఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక భాషల సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే బాహుబలి ది బిగినింగ్ ... బాహుబలి ది కంక్లూజన్ ...  సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరోయిన్ గా నటించి ఈ ముద్దు గుమ్మ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది.

 అలాగే పాన్ ఇండియా మూవీ అయినటు వంటి "కే జీ ఎఫ్ చాప్టర్ 1" లో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను  ఆరబోసి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా ఈ ముద్దు గుమ్మ వరస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఎఫ్ 3 ... గుర్తుందా సీతాకాలం మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే తమన్నా క్రేజ్ మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: