త్రివిక్రమ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న నాని !

Seetha Sailaja
వచ్చేవారం విడుదల కాబోతున్న ‘దసరా’ మూవీ కోసం నాని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈమూవీతో తన 100 కోట్ల కలక్షన్స్ కల నెరవేరుతుందని నాని ఆశిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకాబోతున్న ఈమూవీతో నానీకి బాలీవుడ్ లో ఎలాంటి స్పందన వస్తుంది అన్నవిషయం తేలుతుంది. లేటెస్ట్ గా ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఆశక్తి ఉందని ఈవిషయమై తమ ఇద్దరి మధ్య చర్చలు జరిగిన విషయాన్ని నాని బయటపెట్టాడు. అప్పట్లో తనకోసం త్రివిక్రమ్ ఒక కథ రాస్తాను అని చెప్పారని అయితే ఆకథ ఎంతవరకు వచ్చిందో తనకు తెలియదు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ఒక మల్టీ స్టారర్ మూవీ త్రివిక్రమ్ తో చేసే ప్రతిపాదన కూడ గతంలో వచ్చిన విషయాన్ని వివరిస్తూ ఆ ప్రతిపాదన కొన్ని కారణాలు వల్ల ముందుకు నడవలేదు అని అన్నాడు.

వాస్తవానికి త్రివిక్రమ్ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆశక్తి కనపరచడు. గతంలో ఒక్క నితిన్ తో మాత్రమే త్రివిక్రమ్ సినిమా తీసాడు. టాప్ దర్శకుల మధ్య పోటీ విపరీతంగా ఉండటంతో త్రివిక్రమ్ తన స్థాయిని నిలబెట్టుకోవాలి అంటే అది మీడియం రేంజ్ హీరోలు వల్ల అయ్యే పని కాదని తన దృష్టి ఎప్పుడు టాప్ హీరోల పైనే పెడుతూ ఉంటాడు.

ఇలాంటి పరిస్థితులలో నాని కోరిక త్రివిక్రమ్ విషయంలో ఎంతవరకు తీరుతుంది అన్నవిషయమై సందేహాలు ఉన్నాయి. అయితే ‘దసరా’ మూవీ నానీ కోరిన స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ అయితే మాత్రం టాప్ దర్శకుల దృష్టి నానీ పై పడే ఆస్కారం ఉంది. సంక్రాంతి సినిమాల తరువాత సరైన మాస్ సినిమా ఇప్పటివరకు రాలేదు. దీనితో ఈమూడు నెలల గ్యాప్ తరువాత విడుదల కాబోతున్న ‘దసరా’ ఫలితం గురించి ఇండస్ట్రీ చాల ఆశక్తిగా ఎదురు చూస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: