'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

murali krishna
టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టైటిల్, గ్లింప్స్ ఉగాది కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.
అయితే శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుంచి అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా టైటిల్స్ కు సంబంధించి వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.
అయోధ్యలో అర్జునుడు, అతడే ఒక సైన్యం. అమ్మ కథ టైటిల్స్ వినిపించగా ఈ టైటిల్స్ ఏవీ ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు అమ్మఒడి అనే టైటిల్ వినిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం జగనన్న అమ్మఒడి పేరుతో ఒక స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం అర్హత ఉన్న తల్లుల ఖాతాలో భారీ మొత్తంలో నగదును జమ చేస్తుండటం గమనార్హం.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు,పవన్ పార్టీ అయిన జనసేనకు అభిమాని కావడం గమనార్హం. పవన్ స్పీచ్ లలో కొన్ని స్పీచ్ లు త్రివిక్రమ్ రాసిచ్చిన స్పీచ్ లే అని చాలామంది భావిస్తారు. మరి త్రివిక్రమ్ ఏపీ ప్రభుత్వ పథకాన్ని టైటిల్ గా పెడతారని చెప్పలేమని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడంతో పాటు ఆ తర్వాత జక్కన్న సినిమాతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి త్వరలో వరుస అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.
మహేష్ అభిమానులు త్రివిక్రమ్ సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు దానికి కారణం తమ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి తో కనుక త్రివిక్రమ్ గారు తొరగా కంప్లీట్ చేసి ఆయన్ను ఫ్రీ చేస్తే రాజమౌళి గారి ప్రాజెక్ట్ పట్టాలెక్కేది అని అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: