విజయ్ ... గౌతమ్ నెక్స్ట్ మూవీకి ఆ పాన్ ఇండియా సినిమాటోగ్రాఫర్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి క్లాస్ మూవీ ని తిరకేక్కించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్న గౌతమ్ తిన్ననూరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మళ్ళీరావా మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టి మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు .

ఆ తర్వాత జెర్సీ మూవీ తో మరో సారి ప్రేక్షకుల ... విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇదే మూవీ ని షాహిద్ కపూర్ తో హిందీ లో రూపొందించిన ఈ దర్శకుడు ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించక లేకపోయినప్పటికీ ... విమర్శకుల నుండి మాత్రం దర్శకుడుగా మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మంచి దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని గౌతమ్ యాక్షన్ ప్లస్ డార్క్ థీమ్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి పాన్ ఇండియా మూవీ కి వర్క్ చేసిన టెక్నీషియన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కే జి ఎఫ్ 1 మరియు కే జీ ఎఫ్ 2 మూవీ లకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేసిన శివ కుమార్ ఈ మూవీ కి కూడా సినిమాటో గ్రాఫర్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: