అలాంటి ధిమ్ లో విజయ్ ... గౌతమ్ మూవీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం లో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత పెళ్లి చూపులు ... అర్జున్ రెడ్డి ... గీతా
 గోవిందం ... టాక్సీ వాలా మూవీ సక్సెస్ లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే టాక్సీవాలా మూవీ తర్వాత అనేక సినిమా లలో హీరో గా నటించిన విజయ్ ఆ స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా విజయ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ప్రస్తుతం విజయ్ ... శివ నర్వన దర్శకత్వంలో రూపొందు తున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటి స్తోంది.

ఈ మూవీ లో సమంత పెళ్లి అయిన యువతీ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శ కత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యాక్షన్ ప్లేస్ కొద్దిగా డార్క్ ధిమ్ కొనసాగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: