కాజల్ అగర్వాల్ "ఘోస్టీ" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి ... రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ , హిందీ  మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ వివాహం చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. 

కాజల్ వివాహం తర్వాత అలాగే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజల్ ... శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ "ఘోస్టీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి సామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తో కాజల్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: