"ఖుషి" మూవీ లో "సమంత" అలా కనిపించబోతుందా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే సమంత ఆఖరుగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ఈ మూవీ తో సమంత క్రేజ్ నటిగా మరింతగా పెరిగింది  ఇది ఇలా ఉంటే సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత ... విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేయగా ... ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ మరియు సమంత లుక్ లు డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో సమంత పాత్రకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సమంత మ్యారేజ్ అయిన మహిళ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: