వైష్ణవ్ తేజ్ 4వ మూవీ కోసం ఆ మలయాళ స్టార్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ స్టేజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఉప్పెన మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. అలాగే ఈ మూవీ లోని నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసును కూడా ఈ హీరో దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఉప్పెన మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వైష్ణవ్ ఆ తర్వాత కొండపొలం అనే సినిమాలో హీరో గా నటించాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ వైవిధ్యమైన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత రంగ రంగా వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో వైష్ణవ్  హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వైష్ణవ్ తన కెరియర్ లో 4 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లో మలయాళ నటుడు జోజు జార్జ్ "చెన్నా రెడ్డి" అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నటించడం కోసం ఈ మలయాళ నటుడు 4 కోట్ల భారీ రెమ్యూనికేషన్ ను తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: