"శాకుంతలం" మూవీ నుండి ఆ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల..!

Pulgam Srinivas
టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా శాకుంతలం అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది.
 

అందులో భాగంగా నిన్న ఈ మూవీ నుండి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. శాకుంతలం మూవీ లోని మోహన్ బాబు కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ మరో అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఆదితి బాలెన్ ... అనన్య నాగళ్ల కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ లను తాజాగా విడుదల చేసింది.

శాకుంతలం మూవీ యూనిట్ ఈ సినిమాలో అతిథి బాలన్ ... ప్రియం వద పాత్రలో కనిపించనున్నట్లు ... అనన్య నాగళ్ళ ... అనసూయ పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వీళ్ళిద్దరి లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దానితో తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: