హీరోయిన్ తో ప్రేమలో పడ్డ సాయి ధరమ్ తేజ్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏదైనా విషయం తెర మీదకి వచ్చిందంటే చాలు మీడియాకి ఫుల్ మీల్స్ దొరికినంత పని అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అలాంటిది హీరో హీరోయిన్ల లవ్ మేటర్ ఏదైనా చిన్న లీక్ వచ్చినా కూడా ఇక మీడియాకు పండగే అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా హీరో హీరోయిన్ల ప్రేమలకు సంబంధించిన వార్తలు చాలా తక్కువగా వినిపిస్తాయి. కానీ బాలీవుడ్లో ఇలాంటి వార్త రోజు ఒకటి పుట్టుకొస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం ఇక ఇలాంటి వార్తలతో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఏకంగా తెలుగు ప్రేక్షకుల సుప్రీం హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం  లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారెందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ తో  ప్రేమలో పడిపోయాడు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నభ నటేష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తన నటనతో తన అందం అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సాయిధరమ్ తేజ్ సోలో బ్రతికి సో బెటర్ అనే సినిమాలోను నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల తన హాట్ హాట్ అందాలను స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా ఈ పోస్టులకు సాయి ధరమ్ తేజ్ లైక్ కొట్టాడు. దీంతో సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు మొదలయ్యయ్. మరి అసలు విషయం ఏంటో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: