అభిమానులలో అంచనాలు పెంచేస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా...!!

murali krishna
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కు రెడీ అవుతున్న సంగతి తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరుగబోతున్నాయి.
వచ్చే వారం లో ఏ సమయం లో అయినా ఎన్టీఆర్ 30 సినిమా యొక్క ముహూర్తపు షాట్ కి క్లాప్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది..  అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించ బోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.ఇక ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.  బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ త్వరలో జరగబోతున్న సినిమా యొక్క పూజా కార్యక్రమాల కు కూడా హాజరు కాబోతున్నాడ ని తెలుస్తుంది..
ఆ విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు ఎన్టీఆర్ 30 నటించడం వల్ల అంచనాలు సినిమా భారీగా పెరిగాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ యొక్క సినిమా స్థాయి పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో అసలైన పాన్ ఇండియా మూవీ అంటే ఇది అంటూ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాను పాన్ ఇండియా సినిమాగా అవడంతో పాటు సినిమాలో ముఖ్య పాత్రలో జాన్వీ కపూర్ నటించడంతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించబోతున్న కారణంగా హిందీ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కొరటాల ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టి సినిమాను చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: