ఆర్సి 15 కు "సీఈవో" టైటిల్ ను ఎందుకు కన్ఫామ్ చేయాలి అనుకుంటున్నారో తెలుసా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించడంతో రామ్ చరణ్ కు కూడా గ్లోబల్ గా ఈ మూవీ ద్వారా గుర్తింపు లభించింది. ఇలా అంతర్జాతీయ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శంకర్ పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నాడు.

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అంజలి ... సునీల్ ... శ్రీకాంత్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జై సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 మూవీ గా రూపొందుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా పొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "సీఈవో" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ అంటే చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసస్ అని అర్థం అని తెలుస్తుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గ కనిపించబోతున్న నేపథ్యంలో ఈ మూవీ కి ఈ టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: