నాగ చైతన్య--సమంతల తీరని ఉమ్మడి కోరిక......!!

murali krishna
టాలీవుడ్ హీరోస్ లో సెకండ్ గ్రేడ్ హీరో గా పేరున్న అక్కినేని నాగ చైతన్య  నూతన గృహ ప్రవేశం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇంటి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆయన అందులో అడుగుపెట్టారట.
విశాలమైన ఈ లగ్జరీ హౌస్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గార్డెన్, జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, థియేటర్ ఇలా అనేక ఆధునిక హంగులతో కూడిన అందమైన భవనం అట. ఈ ఇంటితో సమంతకు కూడా సంబంధం ఉంది. నిజానికి సమంత, నాగ చైతన్య ఇదే ఇంట్లో కలిసి జీవించాలి అనుకున్నారు. తమ ఇద్దరి అభిరుచులకు అనుగుణంగా ఇంటిని డిజైన్ చేయించుకున్నారు.
ఐతే ఈ ఇంటి నిర్మాణం చివరి దశలో ఉండగా వారి మధ్య గొడవలు జరిగాయి. దాంతో విడిపోయారు. సమంత కూడా కొంత డబ్బులు ఆ ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశారని వినికిడి. భార్యాభర్తలు తమ సంపాదన ఉమ్మడిగా ఖర్చు చేస్తారు కాబట్టి, ఆ ఇంటికి అయిన ఖర్చులో సమంత వాటా కూడా ఉందంటారు. ఈ ఇంట్లోకి మారాలని తాము ఉంటున్న ఫ్లాట్ కూడా అమ్మేశారు. మురళీ మోహన్ కి చెందిన లగ్జరీ అపార్ట్మెంట్స్ లో సమంత-నాగ చైతన్యలకు ఒక పెంట్ హౌస్ ఉండేది.
మురళీ మోహన్ దాన్ని అమ్మను అంటే నాగ చైతన్య తండ్రి నాగార్జునతో రికమెండ్ చేయించుకుని మరీ దక్కించుకున్నారట. అక్కడే సమంత, చైతూ కలిసి ఉన్నారు. కొత్త ఇంట్లోకి వెళ్తామన్న ఆలోచనతో దాన్ని అమ్మేశారు. అనూహ్యంగా విడాకులు కావడంతో సమంతకు నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. విశేషం ఏమిటంటే… అమ్మేసిన ఇంటిని సమంత తిరిగి కొనుక్కున్నారు.
నాగ చైతన్యతో కలిసున్న ఆ ఇంటిని సమంత ఎందుకో సెంటిమెంట్ గా భావించారట. అమ్మిన ధర కంటే అధిక మొత్తం చెల్లించి సమంత అక్కడే నివసిస్తున్నారు. హైదరాబాద్ లో సమంత మకాం ఇక్కడే. కొత్త ఆశలతో జంటగా నూతన గృహ ప్రవేశం చేయాలన్న నాగ చైతన్య-సమంతల కోరిక తీరలేదు. చైతూ ఒంటరిగా కొత్తింట్లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరి కెరీర్లో వారు బిజీ. సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. నాగ చైతన్య నటించిన కస్టడీ సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
ఐతే విధిరాతను ఎవరు మార్చలేరు అనే దానికి పాపం చైతు -సమంత జంట ను మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నో అసల్తో కొత్త జీవితంలోకి ప్రవేశించిన వారికీ కొన్ని సంఘటనల వల్ల విడిపోయారు. దీనికి గాను వారి అభిమానులు మళ్ళా కలిస్తే బాగుండును అని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: