ఆ విషయంలో ఎంతో కఠినంగా ఉంటున్న ప్రశాంత్ నీల్...!!

murali krishna
చిత్ర పరిశ్రమలో చాలా మంది వాళ్ళ ప్రతిభ చూపించుకొని ఒక మంచి ఛాన్స్ పొందాలని చూస్తారు కానీ ఇక్కడ అందరికి అంత సులభంగా అవకాశాలు అయితే రావు...కొందరు మాత్రం వచ్చిన అవకాశాలని బాగా వాడుకుంటూ పై స్థాయిలో ఉంటారు. వారిలో ఒకడు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఈయన తీసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాల్ని అయితే అందుకున్నాయి...దాంతో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారారు.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ టైం లో బాగా రెడీ అయి వచ్చిన ఆర్టిస్ట్ లను చూసి నేను షూట్ చేసేది క్లాస్ సినిమా కాదు ఫుల్ మాస్ సినిమా మీరు ఇలా నీట్ గా రెడీ అయి వస్తె షూట్ ఎలా చేయగలను అని వాళ్ళకి చెప్పి వారి గెటప్ లు మొత్తం చేంజ్ చేసేవారట అలా ఆర్టిస్ట్ లు ఏ గెటప్ తో వచ్చిన కూడా వాళ్లని డి గ్లామర్ రోల్ లో చూపిస్తాడటా.ఆయన సినిమాలు మొత్తం కూడా బొగ్గు గనుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి

 ఆర్టిస్ట్ ల కాస్ట్యూమ్స్ కూడా అలానే ఉండేలా చూసుకుంటారట..అందుకే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు డి గ్లామర్ గా అయితే కనిపిస్తారు ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సాలర్ మూవీ తీస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా మీద ప్రేక్షకులతో పాటు అటు ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది..ఇక ఈ మధ్య కొందరు ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ సినిమా మీద కొందరు కొన్ని కామెంట్లు చేసినప్పటికీ దాని మీద ప్రశాంత్ నీల్ పెద్దగా రెస్పాండ్ అయితే కాలేదు అని తెలుస్తుంది.ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన కూడా ఆయన మాత్రం ఆయనకి తోచిన విధం గా సినిమాలు తీస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: