"చంద్రముఖి 2" మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కంగనా..!

Pulgam Srinivas
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి కంగనా రణౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంగనా వరుస సినిమాలో నటిస్తూ ఏ రేంజ్ లో వార్తల్లో నిలుస్తూ ఉంటుందో అదే రేంజ్ లో అనేక విశాయలపై స్పందిస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ క్రేజీ మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం కాంగన ... ప్రభాస్ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ లారెన్స్ హీరో గా పి వాసు దర్శకత్వంలో రూపొందిన చంద్రముఖి 2 మూవీ లో కీలక పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాజాగా సోషల్ మీడియాలో కంగన ... లారెన్స్ తో ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ రోజు తో చంద్రముఖి మూవీ లో నా పార్ట్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే చంద్రముఖి 2 మూవీ లో కంగనా పాత్ర చాలా అద్భుతంగా ఉన్నట్టున్నట్లు ... ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రముఖి మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో చంద్రముఖి 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: