ప్రభాస్ కు గట్టిపోటీ ఇస్తున్న అల్లు అర్జున్ !

Seetha Sailaja

‘బాహుబలి’ తో పాన్ ఇండియా హీరో స్థాయిని అందుకున్న ప్రభాస్ ఆతరువాత విడుదలైన అతడి ‘సాహో’ ‘రాథే శ్యామ్’ మూవీలు పరాజయం చెందడంతో కొంతమేరకు షాక్ తిన్నప్పటికీ అతడి మార్కెట్ కు ఏమాత్రం సమస్య ఏర్పడలేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రతి సినిమాకు అతడికి 100 కోట్ల పారితోషికం ఇస్తున్నారు అంటు వార్తలు వస్తున్నాయి.

అయితే ఒకేఒక్క ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే మూవీకి ఈ సినిమా నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ బన్నీకి 125 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లుగా వార్తలు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

నిజానికి అల్లు అర్జున్ ఇమేజ్ కంటే ప్రభాస్ ఇమేజ్ బాలీవుడ్ లో చాల ఎక్కువ. ‘పుష్ప’ విడుదల అయ్యేంతవరకు అల్లు అర్జున్ గురించి ఎప్పుడూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాయలేదు. కేవలం ఒక్క ‘పుష్ప’ మూవీ బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి సూపర్ స్టార్ట్ ఇచ్చింది. దీనికితోడు బన్నీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందే అతడి సినిమాలు మళయాళంలో ఎక్కువగా డబ్ కావడమే కాకుండా అక్కడి మళయాళ ప్రజలలో బన్నీకి మంచి క్రేజ్ ఉండటమే కాకుండా అతడిని మల్లు అర్జున్ అని పిలుచుకొనే స్థాయికి ఎదిగాడు.

ఈ స్థాయిలో ప్రభాస్ కు మళయాళ ఫలిం ఇండస్ట్రీలో ఎక్కువగా క్రేజ్ లేదు. అంతేకాదు కన్నడ ప్రేక్షకులలో కూడ అల్లు అర్జున్ కు ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అల్లు అర్జున్ కు డార్లింగ్ ప్రభాస్ కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: