రాఘవ లారెన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా..!!

murali krishna
సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక మరియు నయనతార ప్రభు వంటి సెలబ్రిటీలు పి వాసు దర్శకత్వంలో నటించిన చిత్రం చంద్రముఖి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు బాగా తెలిసిందే.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రస్తుతం చంద్రముఖి 2సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట.
అయితే ఈ సినిమాకి పి వాసు దర్శకత్వం వహించినప్పటికీ రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించిన జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కంగనా తాజా అప్డేట్  కూడా ఇచ్చారు.
తాజాగా ఈమె రాఘవ లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలియజేశారు.ఇలా తన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందాన్ని వదిలి వెళ్ళడం తనకు చాలా బాధగా ఉందని ఈమె తెలియజేశారు. ఎంతో అద్భుతమైన టీం నాకు దొరికింది ఇక లారెన్స్ సర్ తో నా ఫోటోలు ఏమీ లేకపోవడంతో ఈరోజు షూటింగ్ పూర్తి కాగానే లారెన్స్ మాస్టర్ గారితో కలిసి ఫోటో దిగానని కూడా ఈమె తెలియజేశారు. ఆయన కెరీర్ కొరియోగ్రాఫర్గా మొదలుపెట్టి.. బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు..
అన్నింటికి మించి ఆయన చాలా మంచి వ్యక్తి  అలాగే గొప్పమనసున్న వ్యక్తి ఎల్లప్పుడూ అందరినీ  బాగా నవ్విస్తూ ఉంటారు... ఇలాంటి వ్యక్తితో పని చేయడం నాకు సంతోషంగా ఉంది అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ఇలా చంద్రముఖి సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది అంటూ కంగనా చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో కంగనా బాలీవుడ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదని కోలీవుడ్ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కూడా తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలు కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదల అవుతున్నప్పటికీ  కూడా డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. మరి చంద్రముఖి 2 సినిమా తనకు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: