ఎట్టకేలకు తన పారితోషకాన్ని బయటపెట్టిన పవన్..!!

Divya
పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల వైపు అడుగులు వేశారు.అలా 2014లో జనసేన పార్టీని స్థాపించి కొంత సీరియస్గా పొలిటికల్స్ ని మొదలుపెట్టారు. 2019 నుంచి టీడీపీ బీజేపీ కూటానికి గుడ్ బై చెప్పేసి 2019 ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని మరి నిలబడడం జరిగింది. ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోవడమే కాకుండా కేవలం రాష్ట్రం మొత్తం మీద ఒక్క సీటును దక్కించుకోగలిగారు.
అయితే ఈసారి 2024 ఎన్నికలలో ఆయన చాలా సీరియస్ గా రాజకీయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఏర్పాటు చేసిన జనసేన 10 వ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ఘనంగా నిర్వహించారు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఈ వేదికను చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ తన మీద ఒక మీడియా సంస్థ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు . గత కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ రూ .1000 కోట్ల ప్యాకేజీ పవన్ కు పంపించాలని ఏపీలో కలిసి పని చేద్దాం అనేది ఈ ప్యాకేజీ సారాంశం అన్నట్లుగా వార్తలు  వినిపించాయి.
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఆ 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటున్నానని ఎద్దేవా చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే తాను చేస్తున్న చిత్రానికి కేవలం 22 రోజులు మాత్రమే పని చేస్తున్నానని అందుకు ఒక్కో రోజుకి రూ.2 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా ఒక చిత్రానికి 44 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ స్థాయి ఇచ్చింది మీరేనని అయితే డబ్బులు మీద నాకు అంతగా ఆశ లేదని ఇవన్నీ నేను సంపాదించుకునే డబ్బుల చూడని సుఖాల అంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఒకో చిత్రానికి కొన్ని కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి వాటన్నిటికీ చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: