ఆస్కార్ వేడుకలకి ప్రణతి డుమ్మా ...కారణం .....!!

murali krishna
ఇపుడు ప్రెసెంట్ సోషల్ మీడియా అనేది మనందరి చేతుల్లో మొబైల్స్ రూపంలో కి అందుబాటులోక వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం రాద్ధాంతం చేయడం అది కూడా స్టార్ సెలబ్రెటీస్ విషయాలలో తల దూర్చడం సామాన్య జనాలకు కామన్ గా అయిపోయింది .
ఐతే మరీ ముఖ్యంగా కొందరు ఆకతాయిలు స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళని ఎప్పుడు ఏకీపారేద్దామా అని ట్రోల్ చేద్దామా అని కాచుకుని కూర్చుని ఉంటున్నారు. కాగా అలాంటి వాళ్లకు అడ్డంగా దొరికిపోయారు మన ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ.
ఐతే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ ఈవెంట్ కి ఆర్.ఆర్.ఆర్ టీం. మొత్తం కదిలి వెళ్ళింది. రాజమౌళి భార్య రమా రాజమౌళి,కార్తికేయ ఆయన భార్య,రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన అందరూ భార్యలతో కలిసి వెళ్లారు. ఎన్టీఆర్ మాత్రమే ప్రణతి లేకుండా ఒక్కడే వెళ్ళాడు.
దీనికి కారణం ఏంటా అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చేర్చ నడుస్తుంది . ఈ క్రమంలోనే కొందరు కావాలని ప్రణతిను ఆస్కార్ ఈవెంట్ కి రానివ్వకుండా అడ్డుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఎలాంటిది ఏమీ లేదని ప్రణతికి తన హెల్త్ బాగోలేని కారణంగానే ఈవెంట్ కి వెళ్ళలేక పోయిందని అందుకే లాస్ట్ మూమెంట్లో ఆమె డ్రాప్ అయిందని లేకపోతే ఎన్టీఆర్ తో పాటు ఆమె కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఈవెంట్ కి వెళ్లాల్సిందే అని టికెట్లు కూడా బుక్ అయ్యాయని చివరి నిమిషంలో హెల్త్ ఇష్యూ కారణంగానే ప్రణతి డ్రాప్ అయింది అంటూ తెలుస్తుంది.
దీనిపై ఎవరు తప్పుడు అర్థాలు తీయొద్దు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముందు నుంచే అందరూ ఆస్కార్ అవార్డుకి వైఫ్స్ తీ వెళ్లాలి అని ఈవెంట్ ని సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటూ అనుకున్నారట. పక్కా ప్లాన్ కూడా వేశారని కానీ లాస్ట్ మూమెంట్లో తారకరత్న చనిపోవడం అదే టైంలో ప్రణతికి హెల్త్ ఇష్యూ రావడంతో వెళ్లలేక పోయిందని నందమూరి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
అంతేగాని ప్రణతి ఆస్కార్ వేడుకలకి వెళ్లక పోవడానికి ఇంకేం కారణం లేదని నందమూరి అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: