మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపిన శ్రీముఖి..!

Pulgam Srinivas
ప్రస్తుతం వరుస సినిమాలతో ... టీవీ షో లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ మూవీ లో శ్రీ ముఖి ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో చిరంజీవి మరియు శ్రీ ముఖి ల మధ్య చాలా సన్నివేశాలు రానున్నట్లు ... ఆ సన్నివేశాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది.

 అలాగే ఖుషి మూవీ లో వచ్చే నడుము సన్నివేశం భోళా శంకర్ మూవీ లో చిరంజీవి మరియు శ్రీ ముఖి ల మధ్య చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు ... ఇప్పటికే ఈ సీన్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు ... వీరిద్దరి మధ్య ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇలా ప్రస్తుతం క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శ్రీ ముఖి అదిరిపోయే లుక్ లో ఉన్న ప్యాంటు ధరించి ... డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న షర్ట్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: