దసరా: ట్రైలర్ విడుదల.. పక్కా ఊరమాస్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో నాని సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌  హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.ఇక ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే ' చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ' అనే పాటతో మొదలైంది. నాని ఫుల్‌ మాస్‌ లుక్‌లో ఎంతగానో అలరించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇంకా అలాగే హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడో లిరికల్‌ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ధీ - రామ్ మిర్యాల ఆలపించగా ఇంకా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇంకా ఈ సినిమా టీజర్ ని విడుదల చెయ్యగా ఇది తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ టీజర్ ఏకంగా సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. గత కొంతకాలం నుంచి సరైన హిట్లు లేక బాధ పడుతున్న నానికి ఈ సినిమా ఖచ్చితంగా భారీ స్థాయిలో పాన్ ఇండియా హిట్ ఇచ్చి నానిని పెద్ద పాన్ ఇండియా హీరోగా చెయ్యడం ఖాయమని మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: