11 రోజుల్లో బలగం మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలో నటించి నటుడు గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వేణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న వేణు ఆ తరువాత ఈటీవీ లో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో లో పాల్గొని బుల్లి తెర ద్వారా కూడా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి ఎంతో మంది బుల్లిcతెర అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు.

 ఇలా సినిమాల ద్వారా బుల్లి తెర ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వేణు తాజాగా బలగం అనే మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరో గా నటించగా ... కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల బాక్స ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. ఈ మూవీ నైజాం ఏరియాలో 11 రోజుల్లో 7.41 కోట్ల కలక్షన్ లను వసూలు చేయగా ... ఆంధ్ర మరియు సీడెడ్ లో కలిపి 4.77 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.58 కోట్ల షేర్ ...  12.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను 11 రోజుల్లో వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపు కొని ఈ మూవీ 24 ఒక లక్షల కలెక్షన్ లను 11 రోజుల్లో వసూలు చేసింది. మొత్తంగా 11 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.70 కోట్ల షేర్ ... 12.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: