ప్రేమ్ రక్షిత్ ను గౌరవించాలని కోరుతున్న అభిమానులు !

Seetha Sailaja
‘నాటు నాటు’ పాట మ్యానియాలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఉన్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ఎవరూ ఊహించని విధంగా ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకోవడంతో ప్రతి వ్యక్తి గర్వంతో మీసం మెలివేస్తున్నాడు.

తెలుస్తున్న సమాచారంమేరకు త్వరలో హైదరాబాద్ కు తిరిగి రాబోతున్న రాజమౌళి కీరవాణి జూనియర్ చరణ్ లకు ఇండస్ట్రీ వర్గాలు ఎయిర్ పోర్ట్ నుండి భారీ స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ నుండి భారీ స్థాయిలో ఊరేగింపుగా వారిని తీసుకువచ్చి ఇండస్ట్రీ తరఫున తమ గౌరవాన్ని తెలియచేస్తారు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే నటుడు మురళీమోహన్ ఇలాంటి భారీ సత్కారాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై ఉంది అంటూ చేసిన కామెంట్స్ కు మంచి స్పందన వస్తోంది.

వాస్తవానికి ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు స్థాయికి వెళ్ళడానికి కీరవాణి సంగీతం చంద్రబోసు సాహిత్యం ఎంతగానో సహకరించినా ఈ పాటను చూసేవారి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కృష్ లేకుంటే ఈపాటకు ఈ స్థాయిలో ఈ గుర్తింపు వచ్చి ఉండేది కాదు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఆస్కార్ అవార్డ్ ల కమిటీ రూల్స్ రీత్యా ఈపాటకు సంబంధించిన అవార్డు తీసుకోవడానికి కేవలం రాజమౌళి చంద్రబోస్ ను మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చ్యబోయే భారీ సత్కార మహోత్సవంలో రాజమౌళి కీరవాణి చంద్రబోసు లతో పాటు ప్రేమ్ రక్షిత్ ను కూడ పిలిచి వేదిక పై అతడికి కూడ సత్కారం చేయడం బాగుంటుంది అంటూ కొందరు సూచనలు చేస్తున్నారు. ఈ సూచన వాస్తవ రూపంలో వచ్చి అమలు జరిగితే ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డ ప్రేమ్ రక్షిత్ కు నిజమైన గుర్తింపు దక్కుతుంది అంటూ అతడి అభిమానులు ఆశిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: