అభిమాని పెళ్లిలో బాలయ్య ప్లేస్ ని భర్తీ చేసిన వ్యక్తి ఎవరు....?

murali krishna
టాలీవుడ్ సినీ పరిశ్రమలోని స్టార్ హీరో ఐనా బాలయ్యను ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు ఫ్లాప్ సినిమాలు సైతం సీడెడ్ లోని కొన్ని జిల్లాలలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
ఐతే ఈ మధ్య కాలంలో ఒక అభిమాని బాలయ్య హాజరైతే మాత్రమే పెళ్లి చేసుకుంటానని హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఐతే బాలయ్య అభిమానికి తాజాగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి బాలయ్య హాజరు కాకపోయినా బాలయ్య అల్లుడు ఐనా భరత్ ఈ పెళ్లికి హాజరయ్యారు. బాలయ్య కూడా ఈ పెళ్లికి రావాలని ప్రయత్నించినా చివరి నిమిషంలో వేర్వేరు రీజన్ల వల్ల కుదరలేదని తెలుస్తోంది. అయితే భరత్ మాత్రం కచ్చితంగా బాలయ్యను కలిసేలా తాను ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం అందుతోంది. బాలయ్య వీరాభిమాని అయిన ఈ వ్యక్తి పేరు పెద్దినాయుడు కాగా పెళ్లి కూతురు పేరు గౌతమీ ప్రియ కావడం గమనార్హం.
చిన్నప్పటి నుంచి పెద్దినాయుడు బాలయ్య సినిమాలను ఎంతో ఇష్టంగా చూసేవాడు. అటు పెద్దినాయుడుతో పాటు ఇటు గౌతమి కూడా బాలయ్య అభిమాని కావడం గమనార్హం. బాలయ్య బాబు వస్తారని పెద్దినాయుడు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయించారు. మార్చి పదకొండువ తేదీ రాత్రి ఈ అభిమాని వివాహం జరిగింది. బాలయ్య సైతం అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
ఐతే బాలయ్య బాబు రాకపోవడానికి కారణం లేకపోలేదు. అది ఏంటంటే తారకరత్న మరణం సైతం బాలయ్యను ఎంతగానో బాధ పెట్టిందని కొంతకాలం పాటు శుభకార్యాలకు దూరంగా ఉండాలని బాలయ్య ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. బాలయ్య పెద్దినాయుడు గౌతమిలను ఆశీర్వదిస్తే బాగుంటుందని నెటిజన్ల సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: