సలార్ మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేస్తున్న ప్రశాంత్ నీల్..!

Pulgam Srinivas
అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించినది తక్కువ మూవీలే అయినప్పటికీ ఇండియా వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు కే జి ఎఫ్ చాప్టర్ వన్ మరియు చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాన్ని పాన్ ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా జగపతి బాబు , పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ మూవీ నుండి.చిత్ర బృందం ఒకటి రెండు పోస్టర్ లు మినహా ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ ప్రమోషన్ కపై శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ వేసవి నుండి ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ... టీజర్ ... పోస్టర్ ... ట్రైలర్ ... సాంగ్స్ అంటూ ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: