మెగాస్టార్ ని వద్దనుకున్నా తమన్నా.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లవాడి దగ్గర నుండి పండు ముసలోళ్ల దాక మెగాస్టార్ అంటే తెలియని వాళ్ళుండరు అనడంలో ఆశ్చర్యం లేదు.అలాంటి చిరంజీవికి మిల్కీ బ్యూటీ తమన్నా బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రెసెంట్  వీరిద్దరూ జంటగా `భోళా శంకర్‌` మూవీలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఐతే మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది.ఐతే హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా పాత్ర కంటే కీర్తి సురేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే తాజాగా స్క్రిప్ట్ లో మరికొన్ని మార్పులు చేశారట. ఈ క్రమంలోనే తమన్నాకు చెప్పకుండా ఆమె పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్ ను తొలగించారట.
ఐతే దాంతో సినిమాలో తమన్నా పాత్రకు ప్రాధాన్యతే కాదు రన్ టైం కూడా బాగా తగ్గిపోయిందట. ఈ నేపథ్యంలోనే తమన్నా అసహనంతో ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేకర్స్ మరో హీరోయిన్ ను తీసుకునే పనిలో పడ్డట్టు టాక్ నడుస్తోంది. మరి నిజంగానే తమన్నా ఈ మూవీ నుంచి తప్పకుండా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఏదేమైనా మెగాస్టార్ తో సినిమా చేయడం అంటే అంత మాములు విషయం కాదు అలాంటి వచ్చిన అవకాశాన్ని తమన్నా వదులు కుంది అంటే ఆమెకు కొంచం పొగరు ఎక్కిందని సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు చెప్తున్నారు. ఐనా తమన్నా ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు ఆమెను ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆమెమీద గుర్రు గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: