విజయ వర్మతో లవ్.. క్లారిటీ ఇచ్చేసిన తమన్నా?

praveen
మిల్కీ బ్యూటీ తమన్న దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. అయితే ఇప్పుడు యువ హీరోయిన్ల దూకుడు పెరిగిపోయిన నేపథ్యంలో అడపాదప అవకాశాలు మాత్రమే అందుకుంటుంది. కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే నటిస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగానే గడుపుతుంది అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నుంచి తమన్న తన లవ్ రిలేషన్షిప్ తో సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు విజయ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో ఉంది అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇక తర్వాత సోషల్ మీడియాలో పోస్టులలో విజయవర్మను తమన్నా ముద్దు పేరుతో పిలవడం చూసి ఇక వీరు ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

 ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్న. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాము అప్పటినుంచి మా బంధంపై గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుమించి నేనేమీ చెప్పను అంటూ తమన్న కుండబద్దలు కొట్టేసింది. అంతేకాదు ఇండస్ట్రీలో హీరోల చుట్టూ నడిచే గాసిప్స్ కంటే హీరోయిన్ల చుట్టూ నడిచే గాసిప్స్ ఎక్కువ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు కూడా అర్థం కాదు చెప్పింది. అంతేకాదు ఎవరో ఒకరితో రిలేషన్షిప్ అంటగట్టి  ప్రతి శుక్రవారం మాకు పెళ్లి చేసేస్తూ ఉంటారు   అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: