వెంకటేష్ ఇమేజ్ ని దెబ్బతీసిన రానా నాయుడు !

Seetha Sailaja
నెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ స్ట్రీమ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. సుమారు 75 సినిమాల వరకు నటించి ఒకనాటి ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమాన హీరోగా ఒక వెలుగు వెలిగిన విక్టరీ వెంకటేష్ ఇలాంటి బూతుల వెబ్ సిరీస్ లో ఎందుకు నటించాడు అంటూ చాలామంది సోషల్ మీడియాలో అతడి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి వెంకటేష్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా వేదాంత పుస్తకాలు చదువుతానని స్వామీ వివేకానంద జీవితం అంటే తనకు ఎంతో ఇష్టమని ఓపెన్ గా చెపుతూ ఉంటాడు. అలాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ఇలాంటి చెత్త వెబ్ సిరీస్ లో ఎందుకు నటించాడు అంటు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ డిస్నీ హాట్ స్టార్ తో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో నెట్ ఫ్లిక్స్ ఈపోటీలో నిలదొక్కుకోవడానికి తెలుగులో టాప్ హీరోల సినిమాలను భారీ మొత్తాలకు కొనడమే కాకుండా టాప్ హీరోలతో భారీ వెబ్ సిరీస్ లు నిర్మించి ఆ వెబ్ సిరీస్ లో నటించిన హీరోలకు భారీ పారితోషికాలు ఇస్తోంది.

సినిమాల పై సెన్సార్ ఉన్నట్లుగా ఓటీటీ వెబ్ సిరీస్ లపై ఎటువంటి సెన్సార్ ఆంక్షలు లేవు. దీనితో తమ ఓటీటీ సభ్యత్వం పెంచుకోవడం కోసం విపరీతమైన బూతు కంటెంట్ ను పెట్టి వెబ్ సిరీస్ ను నిర్మించడం ఒక లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. వాస్తవానికి రానా వెంకటేష్ ల కాంబినేషన్ కావడంతో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రానా నాయుడు’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగా ప్రముఖ దినపత్రికలలో నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం కోట్లు ఖర్చుపెట్టి ‘రానా నాయుడు’ గురించి భారీ ప్రకటనలు ఇచ్చింది.

ఇంత బూతు కంటెంట్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మరీ అతి అనిపించడంతో యూత్ కూడ పెదవి విరుస్తున్నారు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ పై సమీక్షలు వ్రాసిన విశ్లేషకులు ‘రానా నాయుడు పెద్దలకు మాత్రమే’ అంటూ ట్యాగ్ లైన్ లు ఇస్తూ కేవలం ఏవరేజ్ మార్కులు ఇస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: