నాగబాబు హీరోగా మొదలైన సినిమా.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

praveen
సినిమా రంగంలో ఉన్నన్ని ట్విస్ట్ లు  మరే రంగంలో ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే ఒక దర్శకుడు ఒక హీరో కలిసి సినిమా చేసేందుకు సిద్ధపడటం.. ఇక షూటింగ్ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తర్వాత సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్న విషయం మాత్రం సైలెంట్ గానే ఉండిపోతుంది. ఇక తర్వాత కొన్నేళ్లకు ఈ విషయంపై స్పందించి సినిమా ఆగిపోయింది  అంటూ హీరోనో లేకపోతే దర్శకుడో ట్విస్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇప్పటివరకు హీరోలు దర్శకుల మధ్య ఇక ఇలా షూటింగ్ ప్రారంభమై నిలిచిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.  ఇక మెగా ఫ్యామిలీ నుంచి నటుడుగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట. మెగా బ్రదర్ నాగబాబు మొదటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే నాగబాబు హీరోగా కొన్ని సినిమాలను తరికెక్కించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాడట.

 చిరంజీవి తమ్ముడిగా నాగబాబు సినిమా పరిశ్రమకు పరిచయమైన సమయంలో.. ప్రముఖ రచయిత జి సత్యమూర్తి దేవిశ్రీప్రసాద్ దర్శకత్వంలో భూలోకవీరుడు అంతరిక్ష బాలుడు అనే అడ్వెంచర్ మూవీని ప్లాన్ చేయాలని అనుకున్నారట. శుభప్రియ క్రియేషన్స్ బ్యానర్ డి రామరాజు ఇక ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రూపిని, శుభలేఖ సుధాకర్, శ్రీహరి లాంటివాళ్ళు కీలకపాత్రల కోసం ఎంపికయ్యారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఒక బాలుడుకి పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఏర్పడిన స్నేహం ఆధారంగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి పాటల రచయితలు పేర్లు కూడా ఖరారు అయ్యాయి.  తొలి షాట్ కూడా పూర్తయింది. కానీ ఏమైందో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. నాగబాబుతో దర్శకనిర్మాతలకు విభేదాలు వచ్చాయి అని కొంతమంది అంటే..  నిర్మాతలు వెనకడుగు వేశారని కొంతమంది ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే అంతకు ముందు మాత్రం ఇదే కాంబినేషన్తో ట్రైన్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కథతో సూపర్ ఎక్స్ప్రెస్ అనే సినిమా వచ్చిన అది పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: