"సుమ అడ్డా" లో నాని..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ యాంకర్ మరియు నటి అయినటువంటి సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమ ఇప్పటికే ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాలకు సంబంధించిన ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో నటించిన సుమ ఆ తర్వాత ఎక్కువ శాతం టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం ... సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ ను ఫుల్  జోష్ లో ముందుకు సాగించింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సుమ "జయమ్మ పంచాయతీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత సుమ కీలక పాత్రలో నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో జయమ్మ పంచాయతీ మూవీ తో సుమ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుమ ఈటీవీ లో ప్రసారం అవుతున్న సుమ అడ్డ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ షో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రచారాల నిమిత్తం నాని తాజాగా సుమ అడ్డ షో కు వచ్చాడు. మరి కొద్ది రోజుల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: