దయ చేసి ఆ పని చేయొద్దు అంటూ వేడుకుంటున్న పవన్ అభిమానులు...!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నారు. ఒకవైపు హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ సినిమా ను విడుదల చేయకుండా..ఆ సినిమా షూటింగ్ ఆపి మరి వినోదయ సీతమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్(Pawan kalyan) పాల్గొన్నారటా.. ఆ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ సినిమా మాత్రమే కాకుండా సాహో సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న మరో సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాడని తెలుస్తుంది.ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ను చేసేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించేందుకు సెట్ నిర్మాణం అయితే జరుగుతుందని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా అయితే ప్రకటించారు.
మొత్తానికి నాలుగు సినిమాల చిత్రీకరణ ఒక్కసారిగా జరుగుతున్నాయి.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అభిమానులు కూడా స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకే సారి నాలుగు సినిమాలు కాకుండా ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా ఒకే సినిమాకు ఎక్కువ సమయం కేటాయిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని అయితే అభిమానులు కోరుకుంటున్నారు. ఒకే సారి నాలుగు సినిమాలు చేయడం అనేది ఇంతకు ముందు రోజుల్లో నడిచింది. కానీ ఇప్పుడు అలా నడవదు అని ఇప్పటికే పలు హీరోలకు కూడా బాగా అర్థం అయ్యింది. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ అయితే లేదు. ఇలా అభిమానులను కన్ఫ్యూజ్ చేసే బదులు ప్రేక్షకులు ముందుకు ఒక సినిమా తర్వాత మరో సినిమాను తీసుకు రావాలని అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఒక క్లారిటీ లేకుండా ముందుకు సాగుతున్నాడని తెలుస్తుంది.ఆయన నుండి మొదట ఏ సినిమా వచ్చిద్దో క్లారిటీ లేదు.. అందుకే పవన్ అన్నా ముందు ఏదొక సినిమాను పూర్తి చెయ్యి అంటూ అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: